Bank Holidays List: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. 6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు..!
Bank Holidays on Diwali: ఈ నెలలో ధన్తేరస్, దీపావళి, ఛత్ పూజతో సహా అనేక పండుగలు ఉన్నాయి. మీకు బ్యాంకు సంబంధిత పని ఏదైనా ఉంటే, అంతకు ముందు సెలవుల జాబితాను చెక్ చేసుకోంది.
Bank Holidays on Diwali: ఈ నెలలో ధన్తేరస్, దీపావళి, ఛత్ పూజతో సహా అనేక పండుగలు ఉన్నాయి. మీకు బ్యాంకు సంబంధిత పని ఏదైనా ఉంటే, అంతకు ముందు సెలవుల జాబితాను చెక్ చేసుకోంది. ఇప్పుడు ఈ వారం బ్యాంకులు బుధ, గురువారాల్లో రెండు రోజులు మాత్రమే తెరుచుకోనున్నాయి. 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మీకు ఏదైనా పని ఉంటే ఈ 2 రోజుల్లో మాత్రమే పూర్తి చేయండి.
రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంకు సెలవుల జాబితాలో రాష్ట్ర సెలవులు కూడా ఉన్నాయి. నవంబర్ నెలలో ఈసారి ఏయే రోజుల్లో బ్యాంకులు మూసివే ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
దీపావళి నాడు బ్యాంక్ సెలవుల జాబితా..
>> 10 నవంబర్ - గోవర్ధన్ పూజ/లక్ష్మీ పూజ/దీపావళి/దీపావళి కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.
>> 11 నవంబర్ - రెండవ శనివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
>> నవంబర్ 12 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
>> 13 నవంబర్ - గోవర్ధన్ పూజ/లక్ష్మీపూజ/దీపావళి/దీపావళి కారణంగా, అగర్తల, డెహ్రాడూన్, గాంగ్‌టక్, ఇంఫాల్, జైపూర్, కాన్పూర్, లక్నోలోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
>> 14 నవంబర్ - దీపావళి (బలి ప్రతిపాద) / విక్రమ్ సంవత్ న్యూ ఇయర్ / లక్ష్మీ పూజ కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, గాంగ్‌టక్, ముంబై, నాగ్‌పూర్‌లలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
>> 15 నవంబర్ - భాయ్ దూజ్/చిత్రగుప్త జయంతి/లక్ష్మీ పూజ/నింగల్ చక్కుబా/భ్రాత్రి ద్వితీయ కారణంగా గాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకులు మూతపడనున్నాయి.
ఆన్‌లైన్ బ్యాంకింగ్..
నవంబర్ నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. మొబైల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రజలు ఇంట్లో కూర్చొని తమ పనిని చేసుకునే సదుపాయాన్ని బ్యాంక్ అందించింది. అయితే, ఇటువంటి పరిస్థితిలో, మీరు ATM నుంచి నగదు విత్‌డ్రా చేసేటప్పుడు సమస్యలను ఎదుర్కోవచ్చు. అందువల్ల, సెలవులకు ముందు నగదు కోసం ఏర్పాట్లు చేసుకోండి.
అధికారిక లింక్‌ని తనిఖీ చేయండి..
బ్యాంక్ సెలవుల గురించి మరింత సమాచారం కోసం, మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక లింక్‌ను కూడా సందర్శించవచ్చు. https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx ఇక్కడ మీరు ప్రతి నెలా ప్రతి రాష్ట్రం బ్యాంకు సెలవుల గురించి సమాచారాన్ని పొందుతారు.