ఇప్పుడు కాల్, బ్రౌజింగ్ హిస్టరీ రెండేళ్ల పాటు భద్రం..

ఇప్పుడు కాల్, బ్రౌజింగ్ హిస్టరీ రెండేళ్ల పాటు భద్రం.. టెలికాం కంపెనీలకు ఆదేశాలు

Update: 2021-12-26 15:30 GMT

ఇప్పుడు కాల్, బ్రౌజింగ్ హిస్టరీ రెండేళ్ల పాటు భద్రం.. టెలికాం కంపెనీలకు ఆదేశాలు

Call Browsing History: దేశంలోని అన్ని టెలికాం కంపెనీలు ఇప్పుడు మీ కాల్, బ్రౌజింగ్ హిస్టరీని రెండేళ్లపాటు స్టోర్‌ చేస్తాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల కాల్ డేటా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ రికార్డులను స్టోర్‌ చేస్తాయి. ఆ వ్యవధిని ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలకు పెంచింది. డిసెంబర్ 21 నుంచి ఈ నిబంధనలు అమలవుతున్నాయి. ఈ విషయమై డిసెంబర్ 22న ఇతర రకాల టెలికాం కంపెనీలకు కూడా అనుమతులకు పొడిగించారు.

DoT సర్క్యులర్ ఇలా పేర్కొంది "అన్ని వాణిజ్య రికార్డులు, కాల్ వివరాల రికార్డులు, మార్పిడి వివరాల రికార్డులు, IP వివరాల రికార్డులతో పాటు అన్ని లైసెన్సీ నెట్‌వర్క్‌లలో మార్పిడి చేసిన కమ్యూనికేషన్‌ల రికార్డులు స్టోర్‌ చేస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రికార్డుల వ్యాలిటిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది.రెండేళ్లపాటు DoT నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోతే టెలికాం కంపెనీలు స్టోర్ చేసిన డేటాను డిలిట్‌ చేస్తాయి" అని సర్క్యులర్‌ పేర్కొంది.

ఇంటర్నెట్ యాక్సెస్, ఈ-మెయిల్, ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలు లేదా వైఫై కాలింగ్ వంటి మొబైల్ అప్లికేషన్‌ల నుంచి చేసిన కాల్‌ల కోసం వినియోగదారులందరి లాగిన్, లాగ్‌అవుట్ వివరాలతో సహా స్టోర్ అవుతాయి. నిబంధనల సవరణకు ముందు టెలికాం కంపెనీలు 1 సంవత్సరం పాటు మాత్రమే కాల్ డేటా, ఇంటర్నెట్ బ్రౌజింగ్ రికార్డులను నిల్వ చేసేవి. భారతదేశంలో మొత్తం మొబైల్ కనెక్షన్ల సంఖ్య 180 కోట్లు, అందులో ఇంటర్నెట్ 700 మిలియన్ కనెక్షన్ల ద్వారా నడుస్తుంది. దేశంలో ఇప్పుడు 600 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ సంఖ్య ప్రతి మూడు నెలలకు 25 లక్షలు పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగం భారత్‌లో ఉంది. దేశంలోని ప్రతి వ్యక్తి సగటున ప్రతి నెలా 12 GB డేటాను ఉపయోగిస్తున్నారు.

Tags:    

Similar News