Business Idea: మార్కెట్‌ అవసరమే మంచి పెట్టుబడి.. కాసులు కురిపించే బెస్ట్ బిజినెస్‌

Business Idea: మట్టి కప్పుల తయారీని ప్రారంభించేందుకు ప్రారంభంలో ఇంట్లో ఒక చిన్న గది ఉంటే చాలు. ఈ కప్పుల తయారీ కోసం మార్కెట్లో రకరకాల మిషన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

Update: 2024-10-26 01:30 GMT

Business Idea

Business Idea: భారతీయుల ఆలోచనమారుతోంది. ఉద్యోగం చేసే వారితో పాటు సమానంగా వ్యాపారం చేయాలనుకుంటున్న వారు ఎక్కువుతున్నారు. ముఖ్యంగా ఐఐటీ, ఐఏఎమ్‌ల వంటి పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుకున్న వారు కూడా ఉద్యోగం కంటే వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. తాము సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రకరకాల పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తూ ముందుకుసాగుతున్నారు.

అయితే తక్కువ పెట్టుబడిలో మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తే భారీగా లాభాలు ఆర్జించే వ్యాపారాల కోసం ఎక్కువ మంది అన్వేషిస్తున్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు టీ కోసం ప్లాస్టిక్‌ గ్లాసులను ఉపయోగించే వారు, ఆ తర్వాత వాటి స్థానంలో పేపర్‌ కప్పులు వచ్చాయి. అయితే వీటివల్ల కూడా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందన్న వాదనల నేపథ్యంలో ప్రస్తుతం మట్టి కప్పులకు మంచి డిమాండ్ పెరిగింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టం అనే సమస్యే ఉండదని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ మట్టి కప్పుల తయారీని ఎలా ప్రారంభించాలి.? లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మట్టి కప్పుల తయారీని ప్రారంభించేందుకు ప్రారంభంలో ఇంట్లో ఒక చిన్న గది ఉంటే చాలు. ఈ కప్పుల తయారీ కోసం మార్కెట్లో రకరకాల మిషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. కప్పు తయారీకి ఉపయోగించే డైలో కాస్త మట్టిని వేసి పై నుంచి మిషన్‌ను నొక్కితే చాలు వెంటనే కప్పు రడీ అవుతుంది. వీటిని కాసేపు ఎండలో ఆరబెట్టి విక్రయించుకోవడమే. ఈ మిషిన్‌ ఆపరేట్ చేయడానికి ఎలాంటి విద్యుత్‌ కూడా అవసరం ఉండదు. మొత్తం చేత్తోనే చేయొచ్చు.

మార్కెట్లో ప్రస్తుతం ఈ కప్పులకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల టీ ఫ్రాంచైజీలు ఇలాంటి కప్పులనే ఉపయోగిస్తున్నాయి. ఇక మీకు స్థానికంగా ఉండే టీ దుకాణాల్లో ఇలాంటి కప్పులను ప్రమోట్‌ చేసుకొని మొదట్లో తక్కువ మార్జిన్‌ను విక్రయించుకోవాలి. దీంతో మంచి లాభాలు ఆర్జించవచ్చు. కేవలం టీ దుకాణాల్లో మాత్రమే కాకుండా, లస్సీ సెంటర్స్‌లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించాలనుకునే వారికి ఈ బిజినెస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Tags:    

Similar News