ఈ ఉద్యోగుల జీతాలు పెరగవు.. ఇంక్రిమెంట్ ఉండదు..!

TCS Employees: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంక్రిమెంట్ విధానాన్ని మార్చిందని ఈసారి కంపెనీ ఉద్యోగుల జీతాలను పెంచబోదని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది.

Update: 2022-09-04 02:30 GMT

ఈ ఉద్యోగుల జీతాలు పెరగవు.. ఇంక్రిమెంట్ ఉండదు..!

TCS Employees: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంక్రిమెంట్ విధానాన్ని మార్చిందని ఈసారి కంపెనీ ఉద్యోగుల జీతాలను పెంచబోదని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. జీతంలో కోత విధించారంటూ కొంతకాలంగా ఆ సంస్థపై ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఏ ఉద్యోగి జీతంలో కోత పెట్టలేదని కంపెనీ ఇలాంటి వ్యాఖ్యలని ఖండిస్తూ ఈ విధంగా చెప్పింది.

"మేము ఎల్లప్పుడూ పరిశ్రమ బెంచ్‌మార్క్‌ల ప్రకారం ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను అందిస్తాం. కరోనా మహమ్మారిలో కూడా ఇంక్రిమెంట్ సైకిల్ ప్రభావితం కాకుండా చూసుకున్నం. అనుభవజ్ఞులైన ఉద్యోగులందరికీ వార్షిక వేతన అంచనా కింద ఇంక్రిమెంట్ ఉంటుంది" ముఖ్యంగా అమెరికాలో మాంద్యం భయాల కారణంగా టెక్ కంపెనీలు ఆదాయం తగ్గుదలని ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాయి.

ఈ ఉద్యోగుల జీతాలు పెరగవు

ఏడాది పాటుగా పనిచేస్తున్న ఉద్యోగుల జీతాన్ని కంపెనీ పెంచబోదని ఉద్యోగులకు ఈ-మెయిల్ వచ్చిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. కంపెనీ తన మొదటి వార్షికోత్సవ విధానాన్ని మార్చుకున్నట్లు ఉద్యోగులకు తెలిపింది. కంపెనీలో పనిచేస్తూ ఏప్రిల్ 1వ తేదీ లేదా ఆ తర్వాత ఏడాది పూర్తయిన ఉద్యోగులకు ఈసారి ఇంక్రిమెంట్ ఇవ్వబోమని లేఖలో పేర్కొన్నారు. కంపెనీ వార్షిక ఇంక్రిమెంట్ సైకిల్ పూర్తయిన తర్వాతే మొదటి ఇంక్రిమెంట్ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇన్ఫోసిస్, విప్రోల పరిస్థితి

ఇన్ఫోసిస్, విప్రో ఆపరేటింగ్ మార్జిన్లపై ఒత్తిడిని ఆరోపిస్తూ వేరియబుల్ పేలో కొంత శాతాన్ని తగ్గించాలని చెప్పాయి. నివేదికల ప్రకారం విప్రో అక్కడ పనిచేస్తున్న ఫ్రెషర్, జూనియర్ స్థాయి ఉద్యోగుల వేతనాన్ని 30 శాతం వరకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News