Car Loan: టాటా మోటార్స్-BOI కొత్త కార్ లోన్ స్కీమ్..లక్షకు రూ.1502 EMI

Car Loan: టాటా మోటార్స్ కార్ లోన్ సెగ్మెంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది

Update: 2021-11-10 12:30 GMT
టాటా మోటర్స్ (ఫైల్ ఇమేజ్)

Car Loan: టాటా మోటార్స్ కార్ లోన్ సెగ్మెంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు టాటా మోటార్స్ కారును కొనుగోలు చేయడానికి బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) నుంచి కారు రుణాలు తీసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం కింద BOI టాటా మోటార్స్ కస్టమర్లకు 6.85 శాతం వడ్డీ రేటుతో రుణాలను మంజూరు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. టాటా మోటార్స్ ఈ కొత్త పథకం కింద వాహనం మొత్తం ధరలో గరిష్టంగా 90 శాతం రుణం ఇస్తామని తెలిపింది. ఇందులో బీమా, రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. కస్టమర్లు ఏడేళ్ల చెల్లింపు వ్యవధిలో లక్షకు రూ. 1,502 నుంచి నెలవారీ వాయిదా (ఈఎంఐ)ని ఎంచుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

ప్రాసెసింగ్ రుసుము లేదు

ఈ పథకంలో కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. ఒక కస్టమర్ మార్చి 31, 2022 నాటికి టాటా మోటార్స్ కారును కొనుగోలు చేస్తే లోన్ ప్రాసెసింగ్ రుసుము లేదు. అంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే లోన్ ఇస్తారు. FOIR 70 శాతం చొప్పున వర్తిస్తుంది. దీని కోసం కస్టమర్ ఏ ఆదాయ స్లాబ్లో ఉన్నాడో చూడదు. ఈ ఆఫర్ కొత్త ఫరెవర్ రేంజ్, SUVలపై వర్తిస్తుంది. ఈ ఆఫర్ ప్రయోజనం దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తిగత సెగ్మెంట్ కొనుగోలుదారులందరికి వర్తిస్తుంది.

టాటా మోటార్స్

టాటా మోటార్స్ కంపెనీ కస్టమర్ల కోసం ఇలాంటి మరిన్ని ఆఫర్లను ప్రవేశపెట్టింది. గతంలో టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారుల కోసం ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా కొత్త ICE కార్లు, SUVలు, వ్యక్తిగత సెగ్మెంట్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. టాటా మోటార్స్ కార్ కొనుగోలుదారులు కూడా ఈ ఆఫర్లో 31 మార్చి 2022 వరకు ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.

టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు పెరుగుతున్న షేర్ మార్కెట్ దృష్ట్యా, కంపెనీ మరింత ఎక్కువ మంది వినియోగదారులకు తన పరిధిని పెంచుతోంది. కారు రుణాన్ని మరింత సులభంగా ఆకర్షణీయంగా చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. తాజాగా ఇప్పుడు కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కస్టమర్లు ఎటువంటి ప్రాసెసింగ్ రుసుము చెల్లించకుండానే లోన్ తీసుకోగలరు. అలాగే, కారు ధరలో 90% వరకు రుణంగా తీసుకోవచ్చు.

Tags:    

Similar News