Tata Group: టాటాగ్రూప్ సంచలనం.. ఎయిర్ ఇండియా ఉద్యోగులకి ఆ సదుపాయం కల్పించింది..!
Tata Group: టాటాగ్రూప్ ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది.
Tata Group: టాటాగ్రూప్ ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉద్యోగుల జీతం తగ్గించే విషయాన్ని కూడా ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రతి ఉద్యోగికి, వారి కుటుంబానికి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తామని కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఇండియా ప్రకటించింది. అన్నట్లుగానే ఇప్పుడు మే 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేసింది. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద ఆసుపత్రులలో ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఎయిర్‌లైన్ ప్రకారం గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయం దేశంలో ఉన్న శాశ్వత, స్థిర, టర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకి అందుబాటులో ఉంటుంది.
విమానయాన సంస్థ ఉద్యోగులకు ఇచ్చే గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్‌లో ఒక ఉద్యోగికి రూ.7.5 లక్షల బీమా ఉంటుంది. ఒక కుటుంబంలోని గరిష్టంగా ఏడుగురు సభ్యులు ఇందులో పాల్గొనవచ్చు. వీరిలో ఉద్యోగి జీవిత భాగస్వామి, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు/అత్తమామలు ఉంటారు. ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు ఈ బీమా పాలసీని ఉపయోగించవచ్చు. గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం, జీతం తగ్గింపు ఉపసంహరణతో పాటు టాటా ఇటీవల ఎయిర్ ఇండియా ఉద్యోగులకు వాటాదారుగా చేరడానికి అవకాశం గురించి మాట్లాడింది. ఎయిర్‌లైన్ ద్వారా ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్ (ESOP) ఇవ్వబడుతుంది. దీని కింద ఉద్యోగులు కంపెనీ షేర్ హోల్డర్లుగా మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ వెనుక ఉన్న కంపెనీ ఉద్దేశ్యం ఏంటంటే ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడమే.