Gold Coin ATM: గోల్డ్ కాయిన్ ఏటీఎం ప్రారంభించిన తనిష్క్.. ఎలా పనిచేస్తుందంటే..!

Gold Coin ATM: ఏటీఎం నుంచి 100, 200, 500 నోట్లు కాకుండా బంగారు నాణేలు రావడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది.

Update: 2022-05-11 08:00 GMT

Gold Coin ATM: గోల్డ్ కాయిన్ ఏటీఎం ప్రారంభించిన తనిష్క్.. ఎలా పనిచేస్తుందంటే..!

Gold Coin ATM: ఏటీఎం నుంచి 100, 200, 500 నోట్లు కాకుండా బంగారు నాణేలు రావడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా.. ఇది మొదట మీకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఇది సాధ్యమే. తనిష్క్ జ్యువెలర్స్ 'గోల్డ్ కాయిన్ ATM'ని ప్రారంభించింది. దీని ద్వారా సులువుగా బంగారు నాణేలను తీసుకోవచ్చు.

మీ కుటుంబంలో ఎవరైనా బంగారు నాణేలు కొనాలనుకుంటే ఇప్పుడు మీరు గుంపులో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా గోల్డ్‌ కాయిన్‌ ఏటీఎంకి వెళ్లి నాణేలు పొందవచ్చు. తనిష్క్ ప్రారంభించిన ఈ ATM నుంచి మీరు 1 గ్రాము, 2 గ్రాముల 24 క్యారెట్ల బంగారు నాణేలను కొనుగోలు చేయవచ్చు.

ఎంపిక చేసిన 21 జ్యువెలరీ షోరూమ్‌లలో గోల్డ్ కాయిన్ ATMని తనిష్క్ ఇన్‌స్టాల్ చేసింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం గోల్డ్ కాయిన్ ఏటీఎంలలో రూ.25 లక్షల విలువైన బంగారు నాణేలు ఉంటాయి. ఈ గోల్డ్ డిస్పెన్సింగ్ మెషిన్ బ్యాంక్ ఏటీఎం లాగా పనిచేస్తుంది.

కంపెనీ ఇచ్చిన సమాచారంలో 'తనిష్క్ గోల్డ్ కాయిన్ ఏటీఎం' బ్యాంక్ ఏటీఎంలా పనిచేస్తుందని తెలిపింది. కస్టమర్ బంగారు నాణేన్ని ఎంచుకున్నప్పుడు ఏటీఎం మిషన్‌ డబ్బు గురించిన ఆప్షన్ చూపిస్తుంది. చెల్లింపు చేయగానే ప్యాక్ చేసిన బంగారు నాణెం బయటకు వస్తుంది.

Tags:    

Similar News