Maruti Swift: సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ కొంటున్నారా.. ఈ విషయాలు తెలుసా..?
Maruti Swift: సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ కొంటున్నారా.. ఈ విషయాలు తెలుసా..?
Maruti Swift: సెకండ్ హ్యాండ్ కార్లలో మారుతి సుజుకి కంపెనీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మార్కెట్‌లో దాదాపు 80 శాతం కార్లు మారుతి కంపెనీయే విక్రయాలు జరుగుతాయి. ఇందులో ప్రధానంగా మారుతి స్విఫ్ట్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కారు చాలా ఫేమస్. అందుకే సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే స్విఫ్ట్ బెస్ట్ అని చెప్పవచ్చు. 2017సంవత్సరంలో మారుతి 17 లక్షల యూనిట్ల విక్రయాలు జరిపి రికార్డ్ క్రియేట్ చేసింది.
స్విఫ్ట్ అత్యంత సౌకర్యవంతమైన కార్లలో ఒకటి. ఫీచర్ల జాబితాతో పోల్చినప్పుడు ఇతర కార్లని కూడా అధిగమించింది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇది 84bhp ,114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ K-సిరీస్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది. ఆన్/ఆఫ్ ట్రాఫిక్ పరిస్థితుల్లో కూడా ఈ మాన్యువల్‌ని ఆపరేట్ చేయడంలో సమస్య లేదు. స్టీరింగ్ తేలికగా ఉంటుంది. ఇంజిన్-గేర్‌బాక్స్ కాన్ఫిగరేషన్ విషయానికొస్తే ఇది మీ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. నగరంలో ఉండేవారికి మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన పెట్రోల్ ఇంజన్ అయితే బెటర్ అని చెప్పవచ్చు.
2015 మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్‌ల కోసం రూ. 2.44 లక్షల నుంచి రూ.3.46 లక్షల మధ్య చెల్లించవచ్చు. డీజిల్ మోడల్ వేరియంట్‌ను బట్టి రూ. 3.12 లక్షల నుంచి రూ. 4.10 లక్షల మధ్య కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసే ముందు టైర్లు, బ్రేక్ ప్యాడ్‌లు, ఫిల్టర్‌ల పరిస్థితిని తనిఖీ చేయాలి. లేదంటే వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. పెట్రోల్-మాన్యువల్ స్విఫ్ట్ నగరంలో 13కిమీల మైలేజీని హైవేలపై 20కిమీల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్-ఆటో స్విఫ్ట్ సిటీ, హైవేలో వరుసగా 11kmpl, 17kmpl మైలేజీ ఇస్తుంది.