LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు తొలగిన అడ్డంకులు

LIC IPO: దేశంలోనే అతిపెద్దదైన LIC IPOకు అడ్డంకులు తొలగిపోయాయి.

Update: 2022-05-12 15:30 GMT

LIC IPO: ఎల్ఐసీ ఐపీవోకు తొలగిన అడ్డంకులు

LIC IPO: దేశంలోనే అతిపెద్దదైన LIC IPOకు అడ్డంకులు తొలగిపోయాయి. LIC OPOలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. మనీబిల్లు ద్వారా ప్రభుత్వం LIC IPOను చేపట్టడాన్ని పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ప్రజల హక్కులు ఇందులో ఇమిడి ఉన్నందున మనీ బిల్లు ద్వారా చేపట్టాల్సింది కాదని పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ ధర్మాసనానికి నివేదించారు.

అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదిస్తూ భారత చరిత్రలో అతిపెద్ద IPO ఇదని వాదించారు. 73 లక్షల దరఖాస్తుదారులు ఇందులో పాల్గొన్నట్టు తెలిపారు. దీంతో జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ PS నరసింహతో కూడిన ధర్మాసనం దీన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. ఎనిమిది వారాల్లో స్పందన తెలియజేయాలని LICని ఆదేశించింది.

Tags:    

Similar News