SSY vs Mutual Funds: సుకన్య సమృద్ధి యోజన, మ్యూచవల్ ఫండ్స్.. కుమార్తె పేరుపై ఏది బెస్ట్ ఆప్షన్..!
SSY vs Mutual Funds: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల పేరుపై చాలా స్కీములను ప్రవేశపెట్టాయి. ఇందులో చిన్నమొత్తాలను ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్‌లో మంచి ఆదాయం పొందవచ్చు.
SSY vs Mutual Funds: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లల పేరుపై చాలా స్కీములను ప్రవేశపెట్టాయి. ఇందులో చిన్నమొత్తాలను ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్‌లో మంచి ఆదాయం పొందవచ్చు. ఇది ఆడపిల్లల అవసరాలకు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. ఇద్దరు లేదా ముగ్గురు అమ్మాయిలున్న తల్లిదండ్రులకు ఈ స్కీములు ఒక వరంగా మారాయి. ఆర్థిక పరిస్థితుల నుంచి వారిని కాపాడుతున్నాయి. అయితే ఇలాంటి ప్రభుత్వ స్కీములే కాకుండా అమ్మాయిల పేరుపై ప్రైవేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ప్రైవేట్ స్కీంల గురించి మొదటగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ముందు వరుసలో ఉంటుంది. మీరు సుకన్య సమృద్ధియోజనలో తక్కువ ఆదాయం వస్తుందని అనుకుంటే మీ కూతురిపేరుపై మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి యోజన (SSY) 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం వడ్డీలో మార్పులు చేర్పులు చేస్తుంది. మీరు సంవత్సరానికి కేవలం 250 రూపాయలతో ఈ ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించవచ్చు. కూతురు పుట్టినప్పటి నుంచి ఆమెకు 10 ఏళ్లు వచ్చే వరకు ఈ ఖాతాను ఎప్పుడైనా తెరవవచ్చు. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.
మ్యూచువల్ ఫండ్ అనేది మీ డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఒక సాధనం. ఇందులో ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనలో మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్ ఒక ద్రవ పరికరం. వస్తే భారీ మొత్తంలో ఆదాయం వస్తుంది. పోతే కొంతవరకు నష్టపోతారు.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గత ఏడాదిలో పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయమైన రాబడులను అందించాయి.
నిప్పాన్ ఇండియా వాల్యూ ఫండ్ 42.38 శాతం రాబడిని ఇచ్చింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ 43.02 శాతం రాబడిని ఇచ్చింది. యాక్సిస్ వాల్యూ ఫండ్ 40.16 శాతం రాబడిని అందించగా, SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ 40 శాతం వరకు రాబడిని ఇచ్చింది.