Stock Market Today: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market Today: సెన్సెక్స్‌ 207 పాయింట్లు నష్టపోయి 49,538 వద్ద.. నిఫ్టీ 60 పాయింట్లు కుంగి 14,813 వద్ద ట్రేడవుతున్నాయి.

Update: 2021-04-09 04:57 GMT

Mumbai:(File Image)

Stock Market Today: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 49,790 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌, 14,817 పాయింట్ల వద్ద నిఫ్టీ నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 207 పాయింట్లు నష్టపోయి 49,538 వద్ద.. నిఫ్టీ 60 పాయింట్లు కుంగి 14,813 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.62 వద్ద కొనసాగుతోంది.

అమెరికా మార్కెట్లు గురువారం టెక్‌ షేర్ల అండతో లాభాల్లో ముగిశాయి. అయితే, గతవారంలో నిరుద్యోగుల నమోదు పెరగడం మదుపర్లను కాస్త అప్రమత్తతకు గురిచేసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా కరోనా కేసుల విజృంభణ.. దాని కట్టడి కోసం లాక్‌డౌన్‌లు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మైక్రో లాక్‌డౌన్‌లు తప్పవని ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎకానమీపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ లేదని ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశమే. అలాగే నేడు మార్కెట్లకు చివరి రోజు కావడంతో గత రెండు రోజుల లాభాలను మదుపర్లు స్వీకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లు నేడు కొంత అప్రమత్తంగా కదలాడుతున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, ఇంధన, టెలికాం రంగ సూచీలు నష్టాల్లో.. ఎఫ్‌ఎంసీజీ, లోహ, హెల్త్‌కేర్‌, ఐటీ రంగ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. నిఫ్టీ 50లో హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. 

Tags:    

Similar News