Stock Market Update: భారీ నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

Stock Market Update: 57 వేల దిగువన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌

Update: 2022-01-27 05:09 GMT

భారీ నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

Stock Market Update: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలకు ఫెడ్‌ దెబ్బ గట్టిగా తాకింది. ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని 'అమెరికా ఫెడరల్ రిజర్వ్‌' బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. దీంతో గురువారం ఆసియా మార్కెట్లు కుదేలవుతున్నాయి. దీనికి తోడు మండుతున్న చమురు ధరలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది. దీంతో నేడు మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ సూచీ నిఫ్టీ 17వేల మార్క్‌ వద్ద ఊగిసలాడుతోంది. ఫెడ్‌ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గురువారం భారీ నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభమయ్యాయి. 57 వేల దిగువన సెన్సెక్స్‌ ట్రేడ్‌ అవుతుండగా వెయ్యికి పైగా నష్టంలో కొనసాగుతోంది. అలాగే 17 వేల దిగువన నిఫ్టీ ట్రేడింగ్‌ అవుతుండగా 250 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.

Tags:    

Similar News