Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Stock Market: అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకుంటున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. మదుపరులకు లాభాలను అందించాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ దశలో 74వేల 121 వద్ద ఇంట్రాడే హైని తాకింది. గరిష్టాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగిడంతో లాభాలను కోల్పోయింది. చివరకు 114 పాయింట్ల లాభంతో 73వేల852 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 34 పాయింట్లు లాభపడి 22వేల 402 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 218 పాయింట్లు లాభపడింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 377 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్‌లో ప్రధానంగా యునైటెడ్ బ్రావరీస్, సెయిల్, ఎన్‌ఎమ్‌డీసీ, చంబల్ ఫోర్ట్ లాభాలను ఆర్జించాయి. వోడాఫోన్ ఐడియా, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.32 రూపాయలుగా ఉంది.