దేశీ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలు..

*దేశీ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలు.. *సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్, నిఫ్టీ 15 వేల పాయింట్లకు చేరువ.. *సెన్సెక్స్‌ 358 పాయింట్ల లాభంతో 50,614 వద్ద క్లోజ్

Update: 2021-02-04 11:37 GMT

దేశీ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలు..

 దేశీ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్ చేయగా...నిఫ్టీ 15 వేల పాయింట్లకు చేరువ కాగలిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 358 పాయింట్ల లాభంతో 50 వేల మార్క్‌కు ఎగువన 50,614 వద‍్దకు చేరగా నిఫ్టీ సైతం 105 పాయింట్ల లాభంతో 14,895 వద్ద స్థిరపడింది. అయితే వరుస భారీ లాభాల అనంతరం మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో ఆరంభ ట్రేడింగ్ లో సూచీలు దిద్దుబాటు బాట పట్టాయి. ఆ తదనంతరం మెటల్స్ ,PSU బ్యాంకింగ్ రంగ షేర్ల అండతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.

Tags:    

Similar News