Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: తొలిసారిగా 26000 పాయింట్లను దాటిన నిఫ్టీ
Stock Market: ఇవాళ లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిసినా సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త శిఖరాలను తాకాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ తొలిసారిగా 26,000 పాయింట్లు క్రాస్ చేసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 85,000 పాయింట్లకు చేరువైంది. సెన్సెక్స్ 14 పాయింట్ల నష్టంతో 84,914 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 1.4 పాయింట్ల లాభంతో 25,940 పాయింట్ల వద్ద క్లోజయింది.
టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టెక్ మహీంద్ర, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాలతో ట్రేడవగా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌యూఎల్, గ్రాసిం ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇండెక్స్‌లు లాభపడగా, పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ,టెలికాం రంగాల షేర్లు నష్టాల బాటపట్టాయి.