Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 94 పాయింట్ల లాభంతో నిఫ్టీ
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో లాభాల బాట పట్టాయి. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటర్లు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి జై కొట్టడంతో స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. మదుపర్లకు ఉపశమనం కలగడంతో కొనుగోళ్లు పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ అనుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి గంట ముందు నిఫ్టీ, సెన్సెక్స్ సరికొత్త గరిష్ట స్థానాన్ని చేరుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 405 పాయింట్ల భారీ లాభంతో 69 వేల 701 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 20,949 లకు చేరుకున్నాయి. విప్రో, ఐటీసీ, లార్సెన్, టీసీఎస్, టాటామోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, యూపీఎల్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి.