Stock Market Today: మళ్లీ భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీగా నష్టపోయాయి.
Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ భారీగా నష్టపోయాయి. ఈ వారం ఆరంభంలో భారీ లాభాలను మూటగట్టుకున్నమార్కెట్లు ఒక్కరోజు ముచ్చటగానే నిలిచాయి. నిఫ్టీ కీలక 18 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ కూడా కీలక మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఉండటం, US ఫ్యూచర్లు నష్టాల్లోకి జారుకోవడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్ చివరి వరకు రికవరీ చూపలేక భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 632 పాయింట్ల భారీ నష్టంతో 60 వేల 115 వద్ద ముగిసింది. నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయి 17 వేల 914 వద్ద స్థిరపడింది.