Stock Market Today: కీలక మైలురాళ్లను కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market Today: కీలక మైలురాళ్లను కోల్పోయిన సెన్సెక్స్, నిఫ్టీ
Stock Market Today: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీ నష్టాల్ని చవిచూశాయి. ఉదయం ఊగిసలాటతో ప్రారంభమైన మార్కెట్లు... కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే వరకూ అదే ట్రెండ్ కొనసాగింది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. పైగా అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీన సంకేతాలు కూడా దేశీయ మార్కెట్లను షేక్ చేశాయి. అటు చమురు ధరలు మళ్లీ పెరగడం, రూపాయి బలహీనత సైతం అగ్ని ఆజ్యం పోసినట్టయ్యింది. ఫలితంగా సెన్సె్క్స్ 60 వేలు, నిఫ్టీ 18 వేల కీలక మైలురాళ్లను కోల్పోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్ల నష్టంతో 59 వేల 900 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు కోల్పోయి 17 వేల 859 వద్ద క్లోజయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.72 వద్ద స్థిరపడింది.