Stock Market: భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
* రెండోసారి 56వేల మార్కును తాకిన సెన్సెక్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ బుల్ జోరు కొనసాగుతోంది. ప్రధాన సూచీలు గరిష్ట స్థాయిలో సరికొత్త రికార్డులను క్రీయేట్ చేస్తున్నాయి. సెన్సెక్స్ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56 వేల 119 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16 వేల 683 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది. మరోసారి సెన్సెక్స్ 56 వేల మార్క్‌ను తాకింది. మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన 6లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.