Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లు అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ మధ్యాహ్నం ఒంటిగంటలకు ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ సూచీల అస్థిరత మధ్యదేశీయ మార్కెట్ సూచీల ప్రారంభ లాభాలు ఆవిరి అయ్యాయి. ఆ తర్వాత సూచీలు పుంజుకొని స్వల్ప లాభాలతో ఇంట్రాడే ముగిసింది. చివరకు సెన్సెక్స్ 4.89 పాయింట్లు పెరిగి 55 వేల 949 వద్ద స్ధిరపడితే నిఫ్టీ 2.20 పాయింట్లు లాభపడి 16 వేల 639 వద్ద ముగిసింది.