Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి.... బుధవారం ఆద్యంతం లాభాల జోరును కనబరిచాయి. ఉదయం 49,066 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 49,801 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 789 పాయింట్ల లాభంతో 49,733 వద్ద ముగిసింది. నిఫ్టీ 211 పాయింట్లు లాభపడి 14,864 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.89 వద్ద నిలిచింది.
దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రభుత్వం త్వరితగతిన చేపడుతున్న చర్యలు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న యత్నాలు మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ సహా అంతర్జాతీయంగా భారత్‌కు సహకారం లభిస్తుండడంతో మహమ్మారి విజృంభణకు త్వరలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందన్న విశ్లేషణలు మదుపర్లలో విశ్వాసం నింపింది. వీటికి తోడు కీలక రంగాల సూచీలు, ప్రముఖ కంపెనీలు రాణించడంతో సూచీలు లాభాల్లో కదలాడాయి.