దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట

Update: 2020-12-10 05:07 GMT

దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 173 పాయింట్లు పతనమై 45వేల 935 వద్దకు చేరగా... నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించి 13వేల475 వద్ద కదలాడుతోంది. తద్వారా నిఫ్టీ 13వేల 500 పాయింట్ల దిగువకు చేరినట్లయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏషియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌ మారకంలో రూపాయి కదలికలు, క్రూడాయిల్‌ ధరలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Tags:    

Similar News