దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. తాజా వారాన్ని సరికొత్త రికార్డులతో దూకుడుగా ఆరంభించిన దేశీ స్టాక్ సూచీలు మలి సెషన్ కు వచ్చేసరికి బలహీన ధోరణిన సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీ ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడుల వెల్లువ మందగించడం దేశీ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 173 పాయింట్లు క్షీణించి 46,079 వద్దకు చేరగా నిఫ్టీ 45 పాయింట్ల మేర నష్టంతో 13,512 వద్ద కదలాడుతున్నాయి.