Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి.

Update: 2023-06-07 13:00 GMT

Stock Market: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి. రేపు ఆర్‌బిఐ రేట్ల పెంపుపై కీలక ప్రకటన చేయనుంది. ద్రవ్యోల్బణం దిగి వస్తుండటంతో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందన్న సంకేతాలు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది.

సెన్సెక్స్ 62వేల 917 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 63వేల 196 నుండి 62వేల841 మధ్య కదలాడింది. చివరకు 350 పాయింట్ల లాభంతో 63వేల 142 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 18వేల 665 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 18వేల 738 నుండి 18వేల 636 మధ్య ట్రేడైంది. చివరకు 127 పాయింట్లు లాభ పడి 18వేల 726 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు పైసలు పెరిగి 82పాయింట్ 54 వద్ద నిలిచింది. 

Tags:    

Similar News