Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల ముగింపు
Stock Market: తాజా వారం తొలి సెషన్ లో లాభాల బాట * గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపధ్యం
Stock Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. తాజా వారం తొలి సెషన్ లో గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ ఆరంభించి లాభాల్లోనే ముగిశాయి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 228 పాయింట్ల మేర లాభంతో 52,328వద్దకు చేరగా నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 15,751 వద్ద స్థిరపడ్డాయి దేశీయంగా కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం, ఆశాజనకంగా రుతుపవనాల పురోగతి తదితర అంశాలు మద్దతుగా నిలిచాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.