Stock Market: భారీ నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
1,100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబరు డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్ల అప్రమత్తతతో సూచీలు కుదేలవుతున్నాయి. బ్యాంకింగ్, మెటల్, విద్యుత్, రియల్టీ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ ఏకంగా1100 పాయింట్లు పడిపోగా.. 800 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 18వేల మార్క్‌ను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా కుంగాయి.