Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల ముగింపు
Equity Market: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు * గ్లోబల్ మార్కెట్ల బలహీన సంకేతాల నేపధ్యం
Equity Market: దేశీ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాల్లో ముగిశాయి క్రితం సెషన్ లో భారీ నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు తాజా సెషన్ లోనూ ప్రతికూల ధోరణిన ట్రేడింగ్ ఆరంభించి నష్టాలను మిగిల్చాయి..బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 178 , నిఫ్టీ 76 పాయింట్లు మేర నష్టాలను నమోదు చేశాయి.
మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 178 పాయింట్ల మేర నష్టంతో 52,323 వద్దకు చేరగా నిఫ్టీ 76 పాయింట్ల మేర కోల్పోయి 15,691 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తులో వడ్డీరేట్లను పెంచవచ్చనే సంకేతాలకు తోడు సూచీల కరెక్షన్ జత కలవడంతో ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు..