Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్ లో లాభనష్టాల మధ్య ఊగిసలాట ధోరణిన సాగిన దేశీ సూచీలు ఆ తదనంతరం లాభాల బాటన సాగాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకోగా వెనువెంటనే తిరిగి లాభాల్లో కొనసాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు ఎగసి 51,115 వద్దకు చేరగా , నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 15,337 వద్ద స్థిరపడ్డాయి. మరోవైపు గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రో ధరలు మరోమారు పెరిగాయి.