Stock Market: భారీ లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు
Stock Market: సెన్సెక్స్ 975 పాయింట్లు జంప్ చేసి 50,540 వద్ద క్లోజ్ * నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15,175 వద్ద స్థిరం
Stock Market: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ సూచీలు వారాంతాన యూ-టర్న్ తీసుకుంటూ లాభాలతో ప్రారంభమై..భారీ లాభాల్లోముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 975 పాయింట్లు జంప్ చేసి 50,540 వద్దకు చేరగా నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15,175 వద్ద స్థిరపడ్డాయి. కాగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూలతలతో గత రెండ్రోజులుగా నష్టాల బాటన సాగిన మార్కెట్లు...వారాంతాన భారీ లాభాలతో మదుపర్లకు ఊరటను అందించాయి.