షాకింగ్‌ : పెరగనున్న స్మార్ట్‌ ఫోన్ల ధరలు

మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకిది చేదువార్తే.. ప్రముఖ బ్రాండ్ లు అయిన ఆపిల్, శామ్‌సంగ్, షియోమి..

Update: 2020-10-02 10:18 GMT

మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే మీకిది చేదువార్తే.. ప్రముఖ బ్రాండ్ లు అయిన ఆపిల్, శామ్‌సంగ్, షియోమి, ఒప్పో, రియల్‌మీ విక్రయించే ఫోన్‌ల ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణం డిస్ప్లే మరియు టచ్ ప్యానెళ్లపై ప్రభుత్వం 10% దిగుమతి సుంకాన్ని విధించింది, దీన్ని తయారీదారులు వినియోగదారుల మీద వేయనున్నారు. దాంతో రేట్లు పెరుగుతాయి. ఆత్మ నిర్భర్ భారత్ ప్రచారం కింద స్థానిక తయారీలను ప్రోత్సహించడానికి

ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో దిగుమతి సుంకాన్ని పెంచింది. అదనపు సెస్ కారణంగా దిగుమతిదారులపై 11 శాతం భారం పడనుంది. ఏదేమైనా, సెల్‌ఫోన్‌ల ధరలు ఐదుశాతం పెరిగే అవకాశం ఉంది. ఈ చర్య పండుగ సీజన్లో డిమాండ్ ను దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఉత్పాదక కేంద్రంగా ఎదగడానికి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. తన ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం భారతదేశంలో దుకాణాలను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ఫోన్ తయారీదారులను ఆకర్షించింది.

Tags:    

Similar News