SBI Wecare: ఈనెలతో ముగిసిపోనున్న ఎస్‌బీఐ 'వీ కేర్ డిపాజిట్' పథకం గడువు.. వడ్డీ ఎంతో తెలుసా?
SBI Wecare Deposit Scheme: SBI ఈ పథకంలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై (FD) 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ పథకం 31 మార్చి 2023 వరకు మాత్రమే వర్తిస్తుంది.
SBI Wecare: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'వీ కేర్ డిపాజిట్' పథకం ఈ నెల అంటే సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఈ పథకంలో, సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ ఇవ్వనున్నారు.
'వీకేర్ డిపాజిట్' పథకం అంటే ఏమిటి?
SBI ఈ పథకంలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై (FD) 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ లభిస్తుంది. ఈ పథకం 31 మార్చి 2023 వరకు మాత్రమే వర్తిస్తుంది. నిర్ణీత వ్యవధిలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వినియోగదారులకు మాత్రమే ప్రయోజనం లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు టర్మ్ డిపాజిట్లపై వడ్డీ
5 సంవత్సరాల కంటే తక్కువ రిటైల్ టర్మ్ డిపాజిట్లపై సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు 0.50% ఎక్కువ వడ్డీ లభిస్తుంది. మరోవైపు, 'వీకేర్ డిపాజిట్' పథకం కింద, 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ FDలపై 1% వడ్డీ దక్కనుంది. అయితే, ముందస్తు ఉపసంహరణపై అదనపు వడ్డీ మాత్రం చెల్లించబడదు.
వ్యవధి వడ్డీ రేటు (%) సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు(%)
7 నుండి 45 రోజులు 3.00 3.50
46 నుండి 179 రోజులు 4.50 5.00
180 నుండి 210 రోజులు 5.25 5.75
211 నుండి 1 సంవత్సరం కంటే తక్కువ 5.75 6.25
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.80 7.30
2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 7.00 7.50
3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.50 7.00
5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు 6.50 7.50 (వీకేర్ డిపాజిట్)
400 రోజులు (అమృత్ కలాష్ పథకం) 7.10% 7.60%