SBI: బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా.. ఎస్‌బీఐ సూపర్ ఆఫర్..
SBI: బైక్ కొనడానికి లోన్ కావాలా.. అయితే ఎస్బీఐ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. తక్కువ వడ్డీకే మీ కలని సాకారం చేసుకోవచ్చు.
SBI: బైక్ కొనడానికి లోన్ కావాలా.. అయితే ఎస్బీఐ బంపర్ ఆఫర్‌ని ప్రకటించింది. తక్కువ వడ్డీకే మీ కలని సాకారం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక ద్విచక్ర వాహన రుణం పేరు SBI ఈజీ రైడ్. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రత్యేక రుణ ఆఫర్ అందరికి ఇవ్వడం లేదు. ఎంపిక చేసిన వ్యక్తులకు మాత్రమే ఆఫర్ చేస్తుంది. అందులో మీరు కచ్చితంగా ఎస్బీఐ కస్టమర్ అయి ఉండాలి. YONO మొబైల్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా నిమిషాల వ్యవధిలో ఈ లోన్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
ఈజీ రైడ్ లోన్ ఆఫర్ కింద రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణం అందిస్తుంది. దీనికి గరిష్టంగా 48 నెలలు అంటే 4 ఏళ్లు ఇస్తారు. ఈజీ రైడ్ టూ-వీలర్ లోన్ ప్రారంభ వడ్డీ రేటు 9.35 శాతంగా ఉంటుంది. కస్టమర్ లోన్ అర్హతను బట్టి బైక్ ఆన్-రోడ్ ధరలో 85% వరకు లోన్ పొందుతారు. YONO మొబైల్ యాప్ ద్వారా ఎప్పుడైనా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు బ్యాంకు శాఖకు కూడా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ప్రీ-అప్రూవ్డ్ టూ వీలర్ లోన్ ఆఫర్ కింద లోన్ మొత్తం వెంటనే డీలర్ ఖాతాలో జమ అవుతుంది. మార్చి 31, 2022లోపు రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు కూడా ఉండదు.
అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1 నుంచి 'తక్షణ చెల్లింపు సేవ' లేదా IMPS ఛార్జీని పెంచుతోంది. బ్యాంక్ బ్రాంచ్‌లో IMPS ద్వారా చేసే నగదు బదిలీకి ఎక్కువ ఛార్జీ విధిస్తుంది. IMPS ద్వారా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు పంపితే ఇప్పుడు 20 రూపాయలు కలిపి GST చెల్లించాల్సి ఉంటుంది. IMPS అనేది ఒక ప్రముఖ చెల్లింపు సేవ. ఇందులో నిధులు ఒక బ్యాంకు ఖాతా నుంచి మరొక బ్యాంకు ఖాతాకు సెకన్లలో బదిలీ అవుతాయి.