SBI: వారికోసం ఆ పథకం గడువుని పెంచిన ఎస్బీఐ.. ఎప్పటివరకంటే..?

SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుంది.

Update: 2022-02-20 10:30 GMT

SBI: వారికోసం ఆ పథకం గడువుని పెంచిన ఎస్బీఐ.. ఎప్పటివరకంటే..?

SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన ఎస్బీఐ ఖాతాదారుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు మార్పులు కూడా చేస్తుంది. తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకంలో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీని పొడిగించింది. SBI వీకేర్‌లో పెట్టుబడి పెట్టడానికి బ్యాంక్ గడువును 30 సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక SBI WECARE డిపాజిట్ ప్రారంభించారు. ఇందులో సీనియర్ సిటిజన్‌లు వారి రిటైల్ FDలపై 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ కాల వ్యవధిలో 50 బేసిస్ పాయింట్ల క్రెడిట్ పొందుతారు. ఇది కాకుండా అదనపు 30 బేసిస్ పాయింట్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ప్రకారం SBI Wecare డిపాజిట్ పథకం 30 సెప్టెంబర్ 2022 వరకు పొడగించబడింది.

ఈ పథకం సాధారణ ప్రజలకు వర్తించే వడ్డీ రేటు కంటే 0.8 శాతం ఎక్కువ వడ్డీని అందిస్తుంది. ఫిబ్రవరి 15, 2022 నుంచి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 5.50 శాతం వడ్డీ రేటు ఉంటుంది. ఒక సీనియర్ సిటిజన్ ప్రత్యేక FD పథకం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో డబ్బును డిపాజిట్‌ చేసినట్లయితే FDపై వర్తించే వడ్డీ రేటు 6.30 శాతంగా ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2020లో SBI Wecare టర్మ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం. ప్రస్తుత తక్కువ వడ్డీ రేటు వాతావరణంలో సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీని అందించడానికి ఈ పథకం ప్రారంభించారు.

సీనియర్ సిటిజన్లు కేవలం వడ్డీ పై వచ్చే రాబడితో కాలం వెళ్లదీస్తారు. అందుకు బ్యాంకు వారి అవసరాల గురించి ఆలోచించి వారికి ఈ పథకం కింద ఎక్కువ వడ్డీ చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ సదుపాయాన్ని బ్యాంక్ 20 సెప్టెంబర్ 2022 వరకు కొనసాగిస్తోంది. SBI ఈ ప్రత్యేక FD స్కీమ్‌లో 60 ఏళ్లు పైబడిన ఏ సీనియర్ సిటిజన్ అయినా పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ఈ పథకం దేశీయ టర్మ్ డిపాజిట్ పథకం కాబట్టి సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఎన్నారైలు అర్హులు కాదు. ఈ పథకం కింద FDపై వడ్డీ నెలవారీ లేదా త్రైమాసిక వ్యవధిలో చెల్లిస్తారు.

Tags:    

Similar News