SBI Mutual Fund: ఎస్బీఐకి సంబంధించి ఈ స్కీమ్‌లో రూ.25000 ఇన్వెస్ట్‌ చేస్తే 9.58 లక్షల ఆదాయం..!

SBI Mutual Fund: ఈ రోజుల్లో చాలామంది సంపాదించిన డబ్బును అధిక లాభాలు వచ్చే వాటిలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటారు.

Update: 2024-04-02 14:30 GMT

SBI Mutual Fund: ఎస్బీఐకి సంబంధించి ఈ స్కీమ్‌లో రూ.25000 ఇన్వెస్ట్‌ చేస్తే 9.58 లక్షల ఆదాయం..!

SBI Mutual Fund: ఈ రోజుల్లో చాలామంది సంపాదించిన డబ్బును అధిక లాభాలు వచ్చే వాటిలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటారు. ఇందుకోసం మంచి ప్లాట్‌ఫామ్‌ కోసం వెతుకుతుం టారు. ఈ క్రమంలో కొంతమంది అత్యాశకు పోయి మార్కెట్‌లో ఉండే కొన్ని ప్రైవేట్‌ సంస్థల్లో పెట్టుబడి పెట్టి సర్వం కోల్పోతుంటారు. మరి కొంతమంది వారి డబ్బుకు భద్రత అలాగే మంచి ఆదాయం చూసుకొని ఇన్వెస్ట్‌ చేసి రాబడి సంపాదిస్తారు. ఇక్కడ పొదుపు అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. కానీ అందుకోసం మంచి ప్లాట్‌పామ్‌ను ఎంచుకోవాలి.

నేడు మార్కెట్‌లో అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వీటిని నుంచి వచ్చే రాబడి మారుతూ ఉంటుంది. మన పెట్టుబడికి అధిక రాబడి రావడమే ముఖ్య లక్ష్యం. కాబట్టి ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. కొన్ని పెట్టుబడులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. దానికి మీద వచ్చే ఆదాయం తక్కువగా లభిస్తుంది. మరికొన్నింటికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఎస్బీఐ స్కీమ్

ఎస్బీఐ మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ స్కీమ్ ను అమలు చేస్తుంది. ఇందులో రూ. 25 వేలు పెట్టుబడి పెడితే నిర్ణీత కాల వ్యవధి తర్వాత రూ. 9.58 లక్షలు పొందుతారు. అంటే పెట్టుబడిదారుడికి దాదాపు 40 రెట్ల వరకు రిటర్న్‌ లభిస్తుంది. ఇందులో రెండు వేర్వేరు పద్ధతుల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) చేసుకోవచ్చు. అలాగే ఈ పథకంలో ఒకేసారి రూ.25 వేలు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మీకు స్థిరంగా 20 శాతం వార్షిక రాబడిని అందుతుంది. మీరు మీ పెట్టుబడిని 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తే మెచ్యూరిటీ విలువ రూ. 9.58 లక్షలు అవుతుంది.

Tags:    

Similar News