అలాంటి కస్టమర్లకి ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఇంట్లో కూర్చొని నగదు విత్ డ్రా ఆప్షన్..!
SBI Doorstep Banking: బ్యాంకులు అందించే అత్యుత్తమ సేవలలో డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఒకటి.
SBI Doorstep Banking: బ్యాంకులు అందించే అత్యుత్తమ సేవలలో డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఒకటి. సీనియర్ సిటిజన్స్‌తో పాటు దివ్యాంగ్ కస్టమర్లకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సేవలకి బ్యాంకులు ఛార్జీలు కూడా వసూలు చేస్తాయి. ఖాతా రకం, పౌరుడిని బట్టి ఈ ఛార్జీలు మారుతూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివ్యాంగు కస్టమర్లు ఇప్పుడు ఎలాంటి ఛార్జీ లేకుండా ప్రతి నెలా మూడు సార్లు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. ఆర్థిక, ఆర్థికేతర సేవలకు బ్యాంక్ రూ.75 జీఎస్టీని వసూలు చేస్తుంది.
డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఎలా..?
ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ప్రయోజనాన్ని పొందడానికి మీరు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ముందుగా కస్టమర్ ప్లే స్టోర్ నుంచి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కి ఒక OTP వస్తుంది. ఈ నెంబర్‌ని డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ పేరు, ఇమెయిల్ (ఐచ్ఛికం), పాస్‌వర్డ్ (పిన్) ఎంటర్ చేయాలి. నిబంధనలు, షరతులకు అంగీకరించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత DSB సిస్టమ్ నుంచి ఒక SMS వస్తుంది. కస్టమర్ ఏదైనా అదనపు సమాచారం కోసం పిన్‌తో యాప్‌కి లాగిన్ కావాలి. కస్టమర్ యాడ్ అడ్రస్ ఎంపికను ఎంచుకోవడం ద్వారా చిరునామా వివరాలను ఎంటర్ చేయాలి.
నగదు విత్ డ్రా ప్రాసెస్
ముందుగా కస్టమర్ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌కి లాగిన్ కావాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎంచుకోవాలి. ఖాతా నంబర్‌లోని చివరి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి. దీంతో మొబైల్ నెంబర్‌కి ఒక OTP వస్తుంది. తర్వాత ఈ నెంబర్‌ని DSB మొబైల్ నంబర్‌లో ఎంటర్ చేయాలి. తర్వాత ఓకె చేయడంతో బ్యాంక్ పేరు, ఖాతా నంబర్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. కస్టమర్ నగదు విత్ డ్రా కోసం మోడ్‌ను ఎంచుకోవాలి. కస్టమర్ ఖాతా నుంచి ఛార్జీ తీసివేసి సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. SMS ద్వారా ఏజెంట్ గురించి సమాచారం పొందుతారు. తర్వాత కస్టమర్ ఏజెంట్ వివరాలను ధృవీకరించాలి అతనితో కోడ్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.