SBI Clients Alert: ఎస్బీఐ ఖాతాదారులు అలర్ట్.. డబ్బులు విత్ డ్రా చేసేవారికి కొత్త నిబంధన
SBI Clients Alert: ఎస్బీఐ ఖాతాదారులు మారిన నిబంధనలు తెలుసుకోవడం అవసరం.
SBI Clients Alert: ఎస్బీఐ ఖాతాదారులు మారిన నిబంధనలు తెలుసుకోవడం అవసరం. లేదంటే ఇబ్బందిపడుతారు. ఖాతాదారులు డబ్బులు విత్ డ్రా చేయడానికి కొత్త నిబంధన జారీ చేసింది. దీని ప్రకారం ఏ ఎస్బీ
ఐ ఏటీఎంలోనైనా సరే రూ.10000 కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే OTP తప్పనిసరి. ఖాతాదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. దీనివల్ల మోసాలు తక్కువ జరిగే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం ఎస్బీఐ ఏటీఎంలకు మాత్రమే వర్తిస్తుంది.
స్టేట్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ఇటువంటి సేవలను ప్రకటిస్తుంది. లావాదేవీలు సురక్షితంగా జరగడానికి ఇలా చేస్తుంది. OTP ద్వారా డబ్బు విత్ డ్రా చేయడం కూడా ఇందులో భాగమే. దీని కోసం బ్యాంకులో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ మీ వద్ద ఉండాలి. ఆ నెంబర్‌కి OTP వస్తుంది మీరు ఆ OTPని ఏటీఎం మిషన్‌లో టైప్ చేస్తే డబ్బు విత్‌డ్రా అవుతుంది. ఈ OTP ఆధారిత నగదు లావాదేవీలు 10 వేలకు పైబడిన మొత్తానికి మాత్రమే. మీరు అంతకంటే తక్కువ విత్‌డ్రా చేస్తే ATMలో OTPని నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.
స్టేట్ బ్యాంక్ కార్డ్ హోల్డర్ ఇతర బ్యాంకుల ATMల నుంచి నగదు విత్‌డ్రా చేస్తే ఈ సదుపాయం వర్తించదు. SBI ప్రకారం నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (NFS)లో ఈ పని ఇంకా ప్రారంభించలేదు. NFS దేశంలో అతిపెద్ద ఇంటర్ ఆపరబుల్ ATM నెట్‌వర్క్, దేశీయ ఇంటర్‌బ్యాంక్ ATM లావాదేవీలలో 95 శాతానికి పైగా నిర్వహిస్తుంది. కార్డ్ హోల్డర్ విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసిన తర్వాత ATM స్క్రీన్ OTP విండోను చూపుతుంది. లావాదేవీని పూర్తి చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి. అప్పుడు డబ్బు విత్ డ్రా అవుతుంది.