SBI: ఎస్బీఐ ఒక్క ఖాతాతో 3 ప్రత్యేక ప్రయోజనాలు.. అవేంటంటే..?
SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త తెలిపింది.
SBI: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఒక్క ఖాతాతో మూడు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాలను అనుసంధానించే 3-in-1 ఖాతా సౌకర్యాన్ని అందించింది. ఈ ఖాతా కస్టమర్లకు పేపర్‌లెస్, సులభమైన ట్రేడింగ్‌లో సహాయపడుతుంది. వినియోగదారులు ఒకే ఖాతాతో ఈ సదుపాయాన్ని పొందుతారు. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
ఇటీవల SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్‌లో 3-ఇన్-1 అకౌంట్ గురించి తెలిపింది. మీకు సులభమైన, పేపర్‌లెస్ ట్రేడింగ్ అనుభవాన్ని అందించడానికి సేవింగ్స్ ఖాతా, డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాను కలిపి ఒకే ఖాతాగా ఉంటుంది. మీరు SBI 1 ఖాతాలో 3 ఓపెన్ చేయాలంటే తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పత్రాలను కలిగి ఉండాలి. 1. పాన్ కార్డ్ 2. ఫోటోగ్రాఫ్ 3. పాస్‌పోర్ట్, 4. ఆధార్, 5. డ్రైవింగ్ లైసెన్స్, 6. ఓటర్ ID కార్డ్ 7. MNREGA జారీ చేసిన జాబ్ కార్డ్ ఇందులో కొన్ని ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాను కొనసాగించడానికి అవసరమైన పత్రాలు
>> పాస్‌పోర్ట్ సైజు ఫొటో
>> పాన్ కార్డ్ కాపీ
>> ఆధార్ కార్డ్ కాపీ
>> రద్దు చేయబడిన చెక్కు లేదా తాజా బ్యాంక్ స్టేట్‌మెంట్
ఈ-మార్జిన్ సౌకర్యం
ఈ విషయంలో ఈ-మార్జిన్ సౌకర్యం గురించి వ్యాపారులు తెలుసుకోవాలి. ఈ సదుపాయం కింద కనీసం 25% మార్జిన్‌తో వ్యాపారం చేయవచ్చు. అవసరమైన మార్జిన్‌ను పొందడానికి నగదు లేదా కొలేటరల్‌ని ఉపయోగించి 30 రోజుల వరకు పొజిషన్‌ను పొడిగించవచ్చు.