NPS: ఎన్‌పీఎస్ పెట్టుబడి దారులకి గమనిక.. జూలై 15 నుంచి మరిన్ని ప్రయోజనాలు..!
NPS: మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడితే మీకు ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది.
NPS: మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెడితే మీకు ఈ వార్త ఉపయోగకరంగా ఉంటుంది. జులై 15 నుంచి ఎన్‌పిఎస్‌లో ఇన్వెస్ట్ చేయడం మునుపటి కంటే మరింత సురక్షితమైనది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) సర్క్యులర్ జారీ చేయడం వల్ల ఎన్‌పిఎస్‌లో రిస్క్ ప్రొఫైల్ గురించి పెట్టుబడిదారులకు సమాచారం ఇవ్వనున్నారు.
అంతేకాదు దీనిని గమనించి పెట్టుబడిదారులు సొంత నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. అంతేకాకుండా అధిక రాబడి కూడా పొందవచ్చని తెలిపారు. సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు పెన్షన్ ఫండ్ త్రైమాసిక ప్రాతిపదికన 15 రోజులలోపు వెబ్‌సైట్‌లో అన్ని పథకాల రిస్క్ ప్రొఫైల్‌లను షేర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి PFRDA నియమాలను రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం ఆరు స్థాయిల రిస్క్‌ల గురించి పెట్టుబడిదారులకి తెలుస్తుంది. అయితే రిస్క్ ప్రొఫైల్ విశ్లేషణ త్రైమాసిక ప్రాతిపదికన జరుగుతుంది.
టైర్-1, టైర్-2, అసెట్ క్లాస్ ఈక్విటీ (E), కార్పొరేట్ డెట్ (C), గవర్నమెంట్ సెక్యూరిటీస్ (G) స్కీమ్ A ఉన్న పెన్షన్ ఫండ్‌లు స్కీమ్‌ల రిస్క్ ప్రొఫైల్‌ను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. కన్జర్వేటివ్ క్రెడిట్ రేటింగ్ ఆధారంగా 0 నుంచి 12 వరకు క్రెడిట్ రిస్క్ విలువని సూచిస్తారు. 0 అధిక క్రెడిట్ నాణ్యతను సూచిస్తుంది. 12 అత్యల్ప క్రెడిట్ నాణ్యతను సూచిస్తుంది. ప్రతి త్రైమాసికంలో చివరి 15 రోజులలోగా రిస్క్ ప్రొఫైల్ గురించిన సమాచారం సంబంధిత పెన్షన్ ఫండ్ వెబ్‌సైట్‌లో 'పోర్ట్‌ఫోలియో డిస్‌క్లోజర్' విభాగం క్రింద తెలియజేస్తారు.