Restaurants: ఇక రెస్టారెంట్లకి వెళ్లినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు..!

Restaurants: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ గురించి నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)పెద్ద నిర్ణయం తీసుకుంది.

Update: 2022-07-06 13:00 GMT

Restaurants: ఇక రెస్టారెంట్లకి వెళ్లినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు..!

Restaurants: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ గురించి నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు హోటల్‌ లేదా రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి సీసీపీఏ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. సర్వీస్ ఛార్జీలు చెల్లించమని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కస్టమర్‌లను బలవంతం చేయలేవని పేర్కొంది.

అయితే కస్టమర్ తనకు కావాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించవచ్చు. ఇది పూర్తిగా స్వచ్ఛందంగా, ఐచ్ఛికంగా, వినియోగదారుని అభీష్టానుసారం ఉంటుంది. మీరు ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు లేదా ఏదైనా సేవను పొందినప్పుడు మీరు కొంత ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. దీనినే సర్వీస్ ఛార్జ్ అంటారు. హోటల్‌లు లేదా రెస్టారెంట్‌లలో కస్టమర్‌లకు ఆహారం లేదా మరేదైనా సేవలను అందించినందుకు ఈ ఛార్జీ విధిస్తున్నారు. అయితే సీసీపీఏ ఇప్పుడు దీనిపై సరైన నిర్ణయం తీసుకుంది.

సర్వీస్ ఛార్జ్‌ అనేది బిల్లు కింద ఉంటుంది. సాధారణంగా 5 శాతం విధిస్తారు. వాస్తవానికి సర్వీస్ ఛార్జ్‌ అనేది స్వచ్ఛందంగా ఉంటుంది. కానీ రెస్టారెంట్లు, హోటళ్లు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయమై నిరంతరం ఫిర్యాదులు అందడంతో సీసీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు గుర్తించినట్లయితే 1915 నంబర్‌కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Tags:    

Similar News