Currency Notes: కరెన్సీ నోట్లపై నుంచి గాంధీ చిత్రాన్ని తొలగిస్తారా..!

Currency Notes: కరెన్సీ నోట్లపై నుంచి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించడంపై ఆర్బీఐ ఒక ప్రకటనని విడుదల చేసింది.

Update: 2022-06-07 12:10 GMT

Currency Notes: కరెన్సీ నోట్లపై నుంచి గాంధీ చిత్రాన్ని తొలగిస్తారా..!

Currency Notes: కరెన్సీ నోట్లపై నుంచి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రాన్ని తొలగించడంపై ఆర్బీఐ ఒక ప్రకటనని విడుదల చేసింది. నిజానికి ప్రస్తుత కరెన్సీ నోటులో మహాత్మాగాంధీ చిత్రపటం స్థానంలో మరికొంత మంది వ్యక్తుల చిత్రంతో నోట్లను ముద్రించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతున్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం దాగుంతో ఆర్బీఐ వెల్లడించింది.

ఆర్బీఐ సమాధానం

గాంధీజీ స్థానంలో రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే కలాం చిత్రాలతో కూడిన కొత్త సిరీస్ నోట్లను ముద్రించేందుకు ఆర్భీఐ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆలోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్త చాలా వేగంగా వైరల్ కావడంతో ఆర్భీఐ ఈ వార్తలను ఖండించాల్సి వచ్చింది. ఆర్‌బీఐ ఈ మేరకు ట్వీట్ చేస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే.. క‌రెన్సీ నోట్ల‌లో మ‌రిన్ని మేర సెక్యూరిటీ ఫీచ‌ర్ల ఏర్పాటుకు సంబంధించి ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇన్‌స్ట్రుమెంటేషన్ నిపుణుడు దిలీప్ స‌హానికి గాంధీ స‌హా ఠాగూర్‌,క‌లాం ఫొటోల‌ను ఆర్బీఐ పంపింద‌ని, కరెన్సీ నోట్ల‌పై గాంధీ ఫొటో స్థానంలో ఠాగూర్‌, క‌లాం ఫొటోల‌ ముద్ర‌ణ‌కు సంబంధించి ఆయ‌న నుంచి నివేదిక కోరింద‌ని కొన్ని మీడియా సంస్థ‌ల్లో వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలో వాటిపై వివ‌ర‌ణ ఇచ్చిన యోగేశ్ ద‌యాళ్ ఆ వార్త‌ల‌ను ఖండించారు.


Tags:    

Similar News