Reliance jio: రిలయన్స్ జియో నుంచి అదిరిపోయే 2 కొత్త ప్లాన్స్.. రోజుకు 2.5జీబీ డేటాతోపాటు మరెన్నో బెనిఫిట్స్..!
మీరు టెలికాం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారులు అయితే ఈ న్యూస్ మీకు చాలా ప్రత్యేకమైనది. రెండు జియో ప్లాన్‌లతో భారీ లాభాలను పొందవచ్చు.
Reliance Jio Recharge Plans: మీరు టెలికాం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారులు అయితే ఈ న్యూస్ మీకు చాలా ప్రత్యేకమైనది. రెండు జియో ప్లాన్‌లతో భారీ లాభాలను పొందవచ్చు. దీని ధర రూ. 400 కంటే తక్కువగానే ఉంది. రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలో రూ. 50 వ్యత్యాసం కూడా ఉంది. అయితే వినియోగదారులు ఎక్కువ రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ప్లాన్‌లు ఖరీదు, ప్రయోజనాల మధ్య తేడా ఏమిటి, పూర్తి వ్యత్యాసాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
Jio 349 ప్లాన్..
Jio రూ. 349 ప్లాన్‌లో, 30 రోజుల పాటు ప్రతిరోజూ 2.5 GB డేటా అందుబాటులో ఉంటుంది.అంటే, డేటా కావాల్సిన వారికి ఈ ప్లాన్ ఎంతో అద్భుతమైనది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, రోజుకు 2.5GB డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ ఆగదు. కానీ, ఆ తర్వాత మీకు 64Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. ఇది కాకుండా, ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMS సౌకర్యం అందుబాటులో ఉంది. ప్లాన్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంది. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, మీరు ఈ ప్లాన్‌లో జియో యాప్‌ల ఉచిత సభ్యత్వాన్ని కూడా పొందుతారు. అంటే, ఈ ప్లాన్‌తో JioTV, JioCinema, JioSecurity, JioCloud యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను పొందగలుగుతారు.దీనితో పాటు, అర్హత కలిగిన వినియోగదారులు హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ 5Gకి ఉచిత అప్‌గ్రేడ్‌ను కూడా పొదవచ్చు.
జియో 399 ప్లాన్..
రిలయన్స్ జియో ఈ ప్లాన్‌లో, కస్టమర్‌లు 28 రోజుల వాలిడిటీని పొందుతారు. ప్లాన్‌లో రోజువారీ 3GB డేటా లభిస్తుంది. అంటే, కస్టమర్లు 28 రోజుల్లో మొత్తం 84GB డేటాను పొందుతారు.దీనితో పాటు, మీరు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత ఉచిత కాల్‌ల ప్రయోజనాన్ని కూడా పొందుతారు. జియో ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రూ.61 వోచర్‌ను అందిస్తోంది. ఈ వోచర్‌ని ఉపయోగించి, మీరు 6GB అదనపు డేటాను పొందవచ్చు. అంటే, ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 90GB డేటా లభిస్తుంది. JioTV, JioCinema, JioSecurity వంటి యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో ఉచితంగా అందిస్తుంది.