Bank Holidays In August 2024: ఖాతాదారులకు అలర్ట్‌.. ఆగస్టులో 13 రోజులు బ్యాంకులు పనిచేయవు..

Bank Holidays In August 2024: ఆగస్టు నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ప్రకటించింది.

Update: 2024-07-29 09:19 GMT

September Bank Holiday: సెప్టెంబర్ లో సగం రోజులు బ్యాంకులకు సెలవులు ..పూర్తి వివరాలివే

Bank Holidays In August 2024: ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే బ్యాంక్‌ అకౌంట్స్‌ ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరికీ బ్యాంక్‌ ఖాతా ఉండే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావడం. పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్న నేపథ్యంలో అందరికీ బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. దీంతో బ్యాంకు పనివేళలు, సెలవులకు సంబంధించి ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ నెల ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవనే విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటాయి. ఈ క్రమంలోనే వచ్చే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆగస్టు నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ప్రకటించింది. ఆదివారం, రెండో శనివారాలతో పాటు మరో 7 రోజులు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి వీటి ఆధారంగా మీ బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఒకవేళ బ్యాంకులు పనిచేయకపోయినా.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌తో పాటు మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌ సేవలు యథావిధిగా ఉపయోగపడతాయి. ఇంతకీ వచ్చే నెలలో బ్యాంకులు ఏయే రోజుల్లో పనిచేయవో ఆ జాబితాను ఇప్పుడు చూద్దాం..

* ఆగస్టు 3వ తేదీ కేర్ పూజను పురస్కరించుకొని అగర్తలాలో బ్యాంకులు పనిచేయవు.

* ఇక ఆగస్టు 4వ తేదీన ఆదివారం దేశమంతా బ్యాంకులకు సెలవు ఉంటుంది.

* ఆగస్టు 8వ తేదీ టెండాంగ్ లో రమ్ ఫ్యాట్‌ను పురస్కరించుకొని గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పనిచేయవు.

* ఆగస్టు 10వ తేదీ రెండవ శనివారాన్ని పురస్కరించుకొని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.

* ఇక ఆగస్టు 11వ తేదీన ఆదివారం అన్నిచోట్లా బ్యాంకు సెలవు.

* ఆగస్టు 13వ తేదీన పేట్రియాట్ డేని పురస్కరించుకొని ఇంఫాల్‌లో బ్యాంకులు పనిచేయవు.

* స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15వ తేదీన దేశంలోని అన్ని బ్యాంకులు పని చేయవు.

* ఆగస్టు 18వ తేదీన ఆదివారం అన్ని బ్యాంకులు బంద్‌.

* ఆగస్టు 19వ తేదీన రక్షా బంధన్‌ను పురస్కరించుకొని దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.

* ఆగస్టు 20వ తేదీన శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు.

* ఆగస్టు 24,25 తేదీలలో నాల్గవ శనివారంతో పాటు ఆదివారం దేశమంతా బ్యాంకులకు సెలవు.

* ఆగస్టు 26వ తేదీన జన్మాష్టమిని పురస్కరించుకొని దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులు ఉంటాయి.

Tags:    

Similar News