ఆర్బీఐ కఠిన నిర్ణయం.. మరోసారి రెపోరేటు పెంపు..
RBI Raises Repo Rate: ద్రవ్యోల్బణ కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకుంది.
RBI Raises Repo Rate: ద్రవ్యోల్బణ కట్టడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకుంది. మరోసారి రెపోరేట్లను పెంచింది. ప్రస్తుతం ఉన్న రేటుపై అదనంగా 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు RBI గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీంతో రెపోరేటు 4.40 శాతం నుంచి 4.90 శాతానికి పెరిగింది. తాజా పెరుగుదలతో వడ్డీరేటు ఇంచుమించు ఒక శాతం పెరిగినట్టయ్యింది. పెరిగిన రేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని RBI తెలిపింది. దాదాపు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు రెపోరేటు పెరిగింది. ఏప్రిల్, మే నెలలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని ప్రకటించింది. GDP వృద్ధిరేటును 7.2 శాతంగా అంచనా వేసింది.