5 Rupee Coin: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ఆ కాయిన్స్ కనిపించవు..!
5 Rupee Coin: దేశంలో కరెన్సీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంచనల నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
5 Rupee Coin: దేశంలో కరెన్సీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంచనల నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. పాత రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వాటి స్థానంలో కొత్త రూ. 500 నోట్లతో పాటు, రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత రూ. 2 వేల నోట్లను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో పాత రూ. 5 నాణేలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఎక్కువగా చలామణీలు ఉన్న మందంగా ఉండే కాయిన్స్ ప్రస్తుతం మార్కెట్లో క్రమంగా తగ్గుతుండడాన్ని గమనించవచ్చు. వీటి స్థానంలో ప్రస్తుతం ఇత్తడితో చేసిన నాణేలను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి కాయిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న కాయిన్స్‌తో పోల్చితే ఇవి మందం తక్కువగా ఉండడంతో పాటు, బరువు కూడా తక్కువగా ఉంటున్నాయి.
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెటల్‌తో తయారు చేసే రూ. 5 కాయిన్స్‌ను ముద్రించడం పూర్తిగా తగ్గించేసింది. దీంతో రానున్న రోజుల్లో మందంగా ఉన్న పాత రూ. 5 కాయిన్స్ కనిపించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాత కాయిన్స్‌ను ఆర్‌బీఐ ఎందుకు తగ్గిస్తోందన్న ప్రశ్న రావడం సర్వసాధరణమే. అయితే దీని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉందని మీకు తెలుసా.? బంగ్లాదేశ్ కేంద్రంగా ఇందుకు సంబంధించి ఓ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
మందం ఎక్కువగా ఉన్న ఒక్క 5 రూపాయాల కాయిన్స్‌ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్‌లను తయారు చేస్తున్నారు. ఒక్కో బ్లేడ్ ధర రూ. 2 వేసుకున్నా రూ. 5 కాయిన్‌తో రూ. 10 సంపాదిస్తున్నారు. దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు రూ. 5 కాయిన్స్ స్మగ్లింగ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇదండి మార్కెట్లో కొత్త 5 రూపాయాల కాయిన్స్ వెనకాల ఉన్న అసలు కథ.