Narayana Murthy: 80 కోట్ల మందికి ఉచిత రేషన్.. వారానికి 70 గంటల పని చేయాల్సిందే..

Narayana Murthy: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి గతంలో యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని కోరారు.

Update: 2024-12-16 10:28 GMT

Narayana Murthy: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి గతంలో యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని కోరారు. అప్పుడే భారతదేశం.. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందన్నారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఐటీతో సహా ఇతర ఉద్యోగులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి నారాయణ మూర్తి తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. వారానికి 70 గంటల పాటు పని చేయకుంటే దేశంలో ఉన్న పేదరికాన్ని ఎలా అధిగమించగల మంటూ ప్రశ్నించారు.

పశ్చిమబెంగాల్‌లోని కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ మూర్తి మాట్లాడారు. ఇన్ఫోసిస్‌ను ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చినప్పుడు భారతీయులు చేయాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది. భారత్‌లో ఇంకా 80 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకుంటున్నారు. అంటే ఇంకా 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టేగా.. అందుకే ఆశలు, ఆకాంక్షల్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలని.. వారంలో 70 గంటలు పనిచేయకుంటే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలమన్నారు. భవిష్యత్తు కోసమే అంతా కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గతంలో ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ది రికార్డ్ అనే ఒక పాడ్‌కాస్ట్ మొదటి ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొన్నారు. అక్కడే ఈ పని గంటలపై తొలిసారి మాట్లాడారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో చూస్తే.. భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని.. అందుకే భారత యువత మరికొన్ని గంటలు ఎక్కువగా శ్రమించాలన్నారు. ఆ దేశాలతో పోటీపడాలంటే భారత్‌తో యువత ఇకపై వారానికి 70 గంటలు పనిచేయాలన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శించగా.. మరికొందరు సమర్థించారు.

Tags:    

Similar News