Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్ ..వరుసగా తగ్గుతున్న బంగారం ధర..నేటి ధరలు ఇవే
Gold Rate Today: బంగారం ప్రియులకు పండగలాంటి వార్త. పసిడి మరింత తగ్గుముఖం పట్టింది. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయమని చెప్పాలి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
ఈ మధ్య భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మూడు, నాలుగు రోజులుగా భారీగా దిగొస్తోంది. నేడు సోమవారం బంగారం ధర మరింత తగ్గింది. బంగారం అంటే ఇష్టపడే మహిళలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ముఖ్యంగా గత రెండు రోజులుగా ధరల్లో భారీ మార్పు నమోదు అయ్యింది. డిసెంబర్ 16వ తేదీ సోమవారం రూ. 100 వరకు తగ్గింది. మొన్నటి వరకు రూ. 80వేల మార్క్ దాటేందుకు పరుగులు పెట్టిన బంగారం ధర ఇప్పుడు 77వేలకు చేరుకుంది.
బంగారం ధరలు గత మూడ్రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. ఈ రెండ్రోజుల్లోనే ఏకంగా 3వేల వరకు తగ్గడం గమనార్హం. నేడు సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71 వేల 540 పలుకుతోంది. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,030గా నమోదు అయ్యింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం గోల్డ్ రేట్ రూ.71,390గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,880 ఉంది. ధరల తగ్గుదల విషయంలో బంగారంతోపాటు వెండి కూడా పోటీపడుతోంది. గత రెండు రోజుల్లో వెండి ధరలు రూ.4,100 వరకు తగ్గాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి రూ.99,990 గా ఉంది.