RBI New Rules: ఆ డిపాజిట్లపై నిబంధనలు మార్చిన ఆర్బీఐ.. కొత్త రూల్స్ ఏంటంటే..!
RBI New Rules: ఆ డిపాజిట్లపై నిబంధనలు మార్చిన ఆర్బీఐ.. కొత్త రూల్స్ ఏంటంటే..!
RBI New Rules: ఇప్పుడు మీరు డబ్బులని బ్యాంకులలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. FDకి సంబంధించిన నిబంధనలలో RBI మార్పులు చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. మీరు ఒకవేళ FD చేస్తున్నట్లయితే ముందుగానే ఈ విషయాలు తెలుసుకోండి. లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది.
FD మెచ్యూరిటీపై నియమాలలో మార్పు
RBI ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేయకపోతే వాటిపై మీకు తక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీకి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన FDలపై 5% కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 4 శాతం వరకు మాత్రమే ఉంటాయి.
కొత్త నియమాలను అర్థం చేసుకోండి
మీరు 5 సంవత్సరాల మెచ్యూరిటీతో FD చేశారని అనుకుందాం. అది ఈరోజు మెచ్యూర్ అయింది కానీ మీరు డబ్బును విత్‌డ్రా చేయలేదు. అప్పుడు రెండు పద్దతుల్లో మీ డిపాజిట్‌పై వడ్డీ లెక్కిస్తారు. అప్పుడు మెచ్యూర్ అయిన డిపాజిట్‌పై వచ్చే వడ్డీ ఆ బ్యాంకు పొదుపు ఖాతా కంటే తక్కువగా ఉంటే అదే వడ్డీని కొనసాగిస్తారు. రెండోది పొదుపు ఖాతాపై వచ్చే వడ్డీ కంటే FDపై వచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటే పొదుపు ఖాతాపై వడ్డీని కొనసాగిస్తారు. అంటే ఏది తక్కువ ఉంటే అ వడ్డీని కొనసాగిస్తారు.
పాత నిబంధనలు ఎలా ఉన్నాయంటే..
పాత నిబంధనల ప్రకారం FD మెచ్యూర్ అయినప్పుడు దానిని విత్ డ్రా చేయకుంటే ఇంతకు ముందు కాలానికి చెల్లించిన వడ్డీయే చెల్లించేవారు. కానీ ఇప్పుడు అలా జరగదు. కాబట్టి మెచ్యూరిటీ అయిన వెంటనే డబ్బు విత్‌డ్రా చేసుకుంటే మంచిది.