ఫిక్స్‌డ్ డిపాజిట్ల నియమాలని మార్చిన ఆర్బీఐ.. తెలుసుకోపోతే చాలా నష్టపోతారు..!
Fixed Deposits: మంచి ఆదాయం కోసం చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు.
Fixed Deposits: మంచి ఆదాయం కోసం చాలామంది ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతారు. కానీ ఆర్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల నిబంధనలలో మార్పు చేసింది. అందకే ఈ విషయం ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. గత కొన్ని రోజులుగా అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అందువల్ల ఎఫ్‌డి చేసేముందు కొంచెం తెలివిగా వ్యవహరించండి. మీకు ఈ నియమాలు తెలియకపోతే చాలా నష్టాన్ని భరించవలసి ఉంటుంది.
వాస్తవానికి ఆర్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇప్పుడు మెచ్యూరిటీ తర్వాత మీరు డబ్బుని క్లెయిమ్ చేయకపోతే దానిపై తక్కువ వడ్డీని పొందుతారు. ఈ వడ్డీ సేవింగ్స్ ఖాతాపై వచ్చే వడ్డీకి సమానంగా ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన FDలపై 5% కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తాయి. పొదుపు ఖాతాపై వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 4 శాతం వరకు మాత్రమే ఉంటుంది.
ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయి ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే పొదుపు ఖాతా వడ్డీ లేదా ఎఫ్‌డిపై నిర్ణయించిన వడ్డీ ఈ రెండింటిలో ఏది తక్కువ ఉంటే దానిని చెల్లిస్తారు. ఈ కొత్త నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకుల డిపాజిట్లపై వర్తిస్తాయి. గతంలో FD మెచ్యూర్ అయి ఆ డబ్బుని విత్ డ్రా చేయకపోతే గతంలో చెల్లించే వడ్డీనే కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అది జరగదు. మెచ్యూరిటీ తర్వాత డబ్బు విత్‌డ్రా చేయకపోతే దానిపై FD వడ్డీ లభించదు. కాబట్టి మెచ్యూరిటీ అయిన వెంటనే డబ్బు విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం.