RBI: ఇక ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయలేరు.. ఆంక్షలు విధించిన ఆర్బీఐ

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఓ ప్రైవేట్ బ్యాంక్‌పై కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2022-03-12 14:07 GMT

RBI: ఇక ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయలేరు.. ఆంక్షలు విధించిన ఆర్బీఐ

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఓ ప్రైవేట్ బ్యాంక్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త కస్టమర్లని చేర్చుకోవద్దని నిషేధం విధించింది. బ్యాంకులో జరిగిన కొన్ని అవకతవకల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా పేటీఎం బ్యాంక్ వెంటనే ఐటీ ఆడిట్ సంస్థను ఆపాయింట్​చేసుకుని సమగ్ర ఆడిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్​బీఐ విడదల చేసిన ప్రెస్​రిలీజ్‌లో ఈ విషయాన్ని పేర్కొంది.

ఐటీ ఆడిట్ కంపెనీ నివేదికను సమీక్షించినప్పుడు Paytm బ్యాంక్ కొత్త కస్టమర్‌ల చేరికను పరిశీలిస్తామని తెలిపింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంది. 2020 డిసెంబర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా కొత్త క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ ఉత్పత్తులను ప్రారంభించకుండా HDFC బ్యాంక్‌ని RBI నిషేధించిన సంగతి తెలిసిందే. Paytm పేమెంట్స్ బ్యాంక్ గత సంవత్సరం మాత్రమే RBI నుంచి షెడ్యూల్ బ్యాంక్ స్థితిని పొందినది.

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్​35ఏ ప్రకారం ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే పేటీఎం బ్యాంకులో జరిగిన అవకతవకలు ఏంటో తెలియరాలేదు. ఆర్‌బిఐ ఆర్డర్‌లో ప్రస్తుత కస్టమర్ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం బ్యాంక్ కొత్త కస్టమర్లని మాత్రమే చేర్చుకోవద్దని తెలిపింది. ప్రస్తుత కస్టమర్ల లావాదేవీలు, ఖాతాలకు సంబంధించి మార్గదర్శకాలు వెల్లడించలేదు. కాబట్టి పాత కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి కార్యకలాపాలు యధావిధిగా నడుస్తాయి. 

Tags:    

Similar News