Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉందా.. ఉచిత రేషన్ మాత్రమే కాదండోయ్.. ఈ బెనిఫిట్స్ అస్సలు మిస్ కావొద్దు..!
Ration Card Latest Update: రేషన్ కార్డ్ ద్వారా ఉచిత, చౌకైన రేషన్‌తో పాటు, అనేక సౌకర్యాలను కూడా పొందవచ్చు. అడ్రస్ ప్రూఫ్‌గా రేషన్ కార్డును ఉపయోగించవచ్చు.
Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉందా.. ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఉచిత రేషన్ పొందుతున్నారా.. అయితే, మీకో గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కేంద్ర, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఆహార ధాన్యాలను ఉచితంగా, తక్కువ ధరలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రేషన్ కార్డ్‌తో ఉచిత రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలతో సహా అనేక ఉపయోగాలు ఉన్నాయి.
రేషన్ కార్డు ద్వారా ఉచిత, తక్కువ రేషన్‌తో పాటు, ప్రజలకు అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. మీరు మీ అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డును ఉపయోగించవచ్చు. మీరు బ్యాంకు సంబంధిత పని లేదా గ్యాస్ కనెక్షన్ పొందాలనుకుంటే, మీరు రేషన్ కార్డును సులభంగా ఉపయోగించవచ్చు. ఓటరు ID కార్డ్ తయారు చేసే సమయంలో, మీకు గుర్తింపు కార్డు అవసరం.
రేషన్ కార్డును ఎవరు పొందవచ్చు?
మీ కుటుంబ ఆదాయం 27 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే, మీరు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు. అప్పుడు మీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతల ప్రకారం, దారిద్య్ర రేఖకు ఎగువన (APL), దారిద్య్ర రేఖకు దిగువన (BPL) కార్డులు, అంత్యోదయ రేషన్ కార్డ్ (AAY) ప్రభుత్వం అందిస్తుంది.
ప్రస్తుతం తెలంగాణలో మీసేవ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు చేయడానికి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐ కార్డు, హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌ను ఐడి ప్రూఫ్‌గా ఇవ్వవచ్చు.